ఇస్లామీయ నైతిక ప్రవర్తనల విభాగం

జవాబు: 1 - ఆయనను సృష్టిలోని అందరి కంటే, అన్నింటి కంటే మహోన్నతుడని మరియు ఆయన కొరతలూ, లోపాలన్నింటికీ అతీతుడని మనస్పూర్తిగా నమ్మడం, గౌరవించడం.
2 - ఆయనకు ఎవ్వరినీ, దేనినీ సాటి లేదా భాగస్వామ్యం కల్పించకుండా ఉండటం. కేవలం తనను మాత్రమే ఆరాధించేందుకు గానూ ఆయన మనల్ని సృష్టించినాడు.
3 - ఆయనకు విధేయత చూపడం
4 - ఆయనకు అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండటం
5 - ఆయన పట్ల కృతజ్ఞతాభావం చూపుతూ, ఆయన ప్రసాదిస్తున్న లెక్కలేనన్ని సహాయాలు మరియు అనుగ్రహాలకు బదులుగా ఆయనను స్తుతించడం
6 - ఆయన ఆజ్ఞాపించిన వాటిని సహనంతో పూర్తిచేయడం

జవాబు: 1 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను ఆదర్శంగా తీసుకుని, ఆయన జీవిత విధానాన్ని (సున్నతులను) మనస్పూర్తిగా అనుసరించడం
2 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపడం
3 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండటం.
4. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దానిని మనస్పూర్తిగా విశ్వసించడం.
5 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులకు కొత్త కల్పిత విషయాలను, నూతన పోకడలను చేర్చకుండా ఉండటం
6 - స్వయం కంటే ఎక్కువగా మరియు మొత్తం మానవాళి కంటే (సృష్టిలోని ప్రతిదాని కంటే) ఎక్కువగా ఆయన ను ప్రేమించడం
7 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులను గౌరవించడం మరియు వాటికి పూర్తి మద్దతును ఇవ్వడం

జవాబు: 1 - షరిఅహ్ కు విరుద్ధం కానంత వరకు, ఏ విషయంలోనైనా వారికి విధేయత చూపడం
2 - తల్లిదండ్రులకు సేవ చేయడం
3 - తల్లిదండ్రులకు సహాయ పడటం
4 - తల్లిదండ్రుల అవసరాలు పూర్తి చేయడం
5 - తల్లిదండ్రుల కొరకు దుఆ చేయడం
6 - వారితో ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా మాట్లాడటం, చికాకును వ్యక్తం చేసే "ఉఫ్" అనే చిన్న పదం కూడా పెదవులపై రావడం అనుమతించబడదు.
7 - నవ్వుతూ వారి వైపు చూడటం, వారి వైపు చిరాకుగా, తీక్షణంగా చూడటం నిషేధించబడింది.
8 - వారితో మాట్లాడేటప్పుడు గొంతు పెంచకుండా ఉండటం. మధ్యలో ఎలాంటి అంతరాయం కల్పించకుండా వారి మాటలు పూర్తిగా వినడం. వారిని పేర్లతో పిలవకుండా, బదులుగా "నాన్న" మరియు "అమ్మ" అని పిలవడం.
9 - వారు తమ గదిలో ఉన్నప్పుడు, అందులో ప్రవేశించే ముందు వారి అనుమతి కోరడం
10 - వారి నుదుటిని మరియు చేతులను ముద్దు పెట్టడం

జవాబు: 1 - సోదరసోదరీమణులు, బాబాయి,పిన్ని, మామ,పిన్ని మొదలైన బంధువులను సందర్శించడం ద్వారా రక్తసంబంధాలను కొనసాగించాలి.
2 - మాటలలోనూ, చేతలలోనూ వారి పట్ల దయ చూపుతూ వారికి సహాయం అందించడం.
3 - వారికి ఫోన్ చేసి, వారి మంచిచెడ్డలు, బాగోగులు కనుక్కోవడం.

జవాబు: 1 - మంచి వ్యక్తులను ప్రేమించాలి మరియు వారిని స్నేహితులుగా తీసుకోవాలి.
2 - చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి.
3 - తోటి సోదరులకు సలాం చేయాలి మరియు కరచాలనం చేయాలి.
4 - వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని సందర్శించాలి మరియు వారి అనారోగ్యం దూరం చేయమని అల్లాహ్ ను వేడుకోవాలి.
5 - తుమ్మిన వ్యక్తి కొరకు "యర్హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక) అని ప్రార్థించాలి.
6 - తమను సందర్శించమని పిలిచిన వారి ఆహ్వానాన్ని స్వీకరించాలి.
7 - వారికి అవసరమైనప్పుడు, మంచి సలహాలు ఇవ్వాలి.
8 - వారికి అన్యాయం జరిగినప్పుడు వారిని ఆదుకోవాలి మరియు ఇతరులను అణచియకుండా వారిని అడ్డుకోవాలి.
9 - స్వయంగా తన కోసం దేనిని ఇష్టపడతారో, దానినే ఇతరుల కొరకు కూడా ఇష్టపడాలి.
10 - అవసరమైనప్పుడు వారికి సహాయ సహకారాలు అందించాలి.
11 - మాటలతో, చేతలతో వారికి హాని కలిగించడం మానుకోవాలి.
12 - వారి రహస్యాలను గోప్యంగా ఉంచాలి.
13 - వారిని అవమానించడం, దూషించడం, తృణీకరించడం, వారి ఎదుగుదలను చూసి అసూయపడడం, వారిపై గూఢచర్యం చేయడం లేదా వారిని మోసం చేయడం వంటివి మానుకోవాలి.

జవాబు: 1 - తమ ఇరుగుపొరుగువారి పట్ల మాటలలో మరియు చేతలలో దయ చూపడం మరియు అవసరమైనప్పుడు వారికి సహాయం అందించడం.
2 - ఈద్ పండుగలు, వివాహం మొదలైన సంతోషకరమైన శుభ సందర్భాలలో వారిని అభినందించడం.
3 - వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం మరియు బాధలో ఉన్నప్పుడు వారిని ఓదార్చడం.
4 - మంచి వంటకాలు వండినపుడు, వీలైనంత వరకు దానిని వారికి కూడా పంపడం.
5 - మాటలతో, చేతలతో వారికి హాని కలిగించకుండా ఉండడం.
6 - పెద్ద శబ్దాలతో వారిని గాభరాపెట్టకుండా, వారిపై నిఘాలు వేయకుండా ఉండాలి. వారితో సహనంతో మెలగాలి.

జవాబు: 1 - అతిథి ఆహ్వానాన్ని అంగీకరించడం
2 - ఎవరినైనా సందర్శించినప్పుడు, వారి అనుమతి కోరడం మరియు సందర్శన సమయాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవడం
3 - ప్రవేశించే ముందు అనుమతి కోరడం
4 - సందర్శన సమయంలో అక్కడ ఎక్కువసేపు కాలక్షేపం చేయకుండా ఉండటం
5 - ఆతిథ్యం ఇస్తున్నవారి కుటుంబం వైపు వారికి ఇబ్బంది కలిగించే చూపులను క్రిందికి దించుకోవడం.
6 - అతిథిని స్వాగతించడం, ఉల్లాసంగా మరియు స్నేహపూర్వక మాటలతో వారిని ఆహ్వానించడం
7 - అతిథిని ఉత్తమ స్థానంలో కూర్చోబెట్టడం
8 - అతిథికి ఆహార పానీయాలు అందించి గౌరవించడం

జవాబు: 1 - నొప్పి ఉన్న చోట కుడి చేయి ఉంచి, "బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరిట) అని మూడుసార్లు పలకండి. ఆ తర్వాత ఇలా దుఆ చేయండి: "అవుదు బిఇజ్జతిల్లాహి వ ఖుద్రతీహి మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిర్" (నేను గుర్తించిన మరియు భయపడుతున్న వాటికి వ్యతిరేకంగా అల్లాహ్ యొక్క తేజస్సు మరియు శక్తిలో శరణు పొందుతున్నాను) - ఏడు సార్లు.
2 - అల్లాహ్ నిర్ణయించిన దానితో సంతృప్తిగా మరియు సహనంతో ఉండండి.
3 - రోగిని సందర్శించడంలో త్వరపడడం, రోగి కోసం ప్రార్థించడం మరియు రోగి వద్ద ఎక్కువసేపు ఆగకుండా ఉండటం.
4 - వ్యాధిగ్రస్తులు అడగకుండానే రుఖ్యహ్ (ఖుర్అన్ మరియు సున్నతుల ద్వారా వైద్యం చేసే పద్ధతి) చేయడం.
5 - రోగిని ఓపికగా ఉండమని మరియు ప్రార్థనలు, నమాజులు మరియు తహారతుకు (ఆచార స్వచ్ఛతకు) కట్టుబడి ఉండమని సలహా ఇవ్వడం.
6 - రోగి కొరకు ఇలా వేడుకోవడం: "అస్'అలుల్లాహ్ అల్ అజీమ్ రబ్బుల్ ‘అర్షిల్ ‘అజీమ్ అయ్ యష్'ఫీక్” (మిమ్మల్ని నయం చేయమని, మహాద్భుతమైన అర్ష్ (సింహాసనం) యొక్క ప్రభువు అయిన అల్లాహ్ను నేను వేడుకుంటుతున్నాను) - ఏడు సార్లు.

జవాబు: 1 - సంకల్పాన్ని సంపూర్ణ చిత్తశుద్ధితో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు అంకితం చేయడం
2 - నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం
3 - గురువును అతని సమక్షంలో మరియు పరోక్షంలో గౌరవించడం మరియు సత్కరించడం
4 - అతని సమక్షంలో వినమ్రతతో, అణుకువతో కూర్చోవడం
5 - గురువుకు మధ్యలో అంతరాయం కలగజేయకుండా శ్రద్ధగా వినడం.
6 - గురువును మర్యాదతో ఉత్తమ పద్ధతిలో తన సందేహాలు అడిగి తెలుసుకోవాలి.
7 - గురువును పేరు పెట్టి పిలవడం తగదు

జవాబు: 1 - సభలో ప్రజలకు అభివాదం చేయడం
2 - ఎవరి సీటూ ఖాళీ చేయమని అడగకుండా అందుబాటులో తనకు దగ్గరగా ఉన్న మొదటి ఖాళీ సీటులో కూర్చోవడం, ఉభయుల అనుమతితో తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చోక పోవడం
3 - ఇతరులు కూడా కూర్చునేలా సర్దుబాటు చేయడం
4 - ఇతరుల మాటలకు అంతరాయం కలిగించకూడదు
5 - సమావేశం విడిచి బయలుదేరే ముందు ప్రజలకు అభివాదం చేయడం మరియు వారి అనుమతి తీసుకోవడం
6 - సభ ముగియగానే అక్కడ జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఇలా దుఆ చేయడం: "సుబహానక అల్లాహుమ్మ వబిహమ్'దిక, అష్-హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, అస్తఘ్ఫిరుక వ అతూబు ఇలైక్" (ఓ అల్లాహ్, నీవు పరమపవిత్రుడవు, సకల ప్రశంసలు నీకే శోభిస్తాయి. నీవు తప్ప మరే ఆరాధ్యుడూ లేడు. నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను పశ్చాత్తాపపడుతున్నాను.) సుబహానకల్లాహుమ్మ వ బిహమ్దిక,అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త,అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్థుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతాను.

జవాబు: 1 - పెందరాళే నిద్రపోవడం
2 - ఉదూ (ఆచరణ స్వచ్ఛత) స్థితిలో నిద్రకు ఉపక్రమించడం
3 - వెల్లకిలా పొట్ట మీద నిద్ర పోకూడదు
4 - కుడిచేతిని కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకోవడం
5 - పడుకునే ముందు పక్క మీద దుమ్ము దులపడం
6 - నిద్రకు ఉపక్రమించే వేళ చేసే ప్రార్థనలు : అయత్ అల్-కుర్సీ ఒకసారి మరియు సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్ మరియు సూరతున్నాస్, ఒక్కొక్కటి మూడుసార్లు పఠించాలి. ఆ తరువాత ఇలా ప్రార్థిస్తూ, పడుకోవాలి: "బిస్మిక అల్లాహుమ్మా అముతు వ అహ్యా" (ఓ అల్లాహ్! నీ పేరుతో నేను చనిపోతాను మరియు మరలా బ్రతుకుతాను)
7 - తెల్లవారుజామున చేసే ఫజ్ర్ నమాజు కొరకు మేల్కొనడం
8 - నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఇలా ప్రార్థించాలి: "అల్'హమ్'దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్" (మన నుండి తీసుకున్న తర్వాత మరలా మనకు జీవితాన్ని ఇచ్చిన అల్లాహ్ కే సకల స్తోత్రాలు మరియు ప్రళయదినాన ఆయన వైపునకే మరలుతాము)

జవాబు:
1 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు విధేయత చూపేందుకు అవసరమైన శక్తి పొందటానికి అన్నపానీయాలు సేవిస్తున్నాననే సంకల్పం చేయుకోవడం
2 - భుజించడానికి ముందు చేతులు కడుక్కోవడం
3 - భుజించడానికి ముందు ఇలా ప్రార్థించాలి: "బిస్మిల్లాహ్" (అల్లాహ్ పేరుతో). కుడిచేత్తో మరియు పళ్ళెంలో తనకు సమీపంలో ఉన్నదాని నుండి తినాలే గానీ, ప్లేట్ మధ్యలో లేదా ఇతరుల ముందు ఉన్న దాని నుండి కాదు.
4 - భుజించడానికి ముందు "బిస్మిల్లా" అని చెప్పడం మరచిపోయిన సందర్భంలో, ఇలా పలకాలి: "బిస్మిల్లాహి అవ్వలుహు వ ఆఖిరుహు" (అల్లాహ్ పేరతో, ఆరంభంలోనూ మరియు అంతంలోనూ).
5 - లభించిన భోజనంతో తృప్తి పడటం, దానిని విమర్శించకుండా ఉండడం అంటే ఇష్టం ఉంటే తినాలి, లేకుంటే వదిలేయాలి.
6 -కొన్ని ముద్దలు మాత్రమే తినడం మరియు అతిగా తినకుండా ఉండడం.
7 - భోజనం లేదా పానీయంలో ఊదకూడదు మరియు అది చల్లబడే వరకు వేచి ఉండాలి.
8 - తన కుటుంబంతో లేదా అతిథులతో కలిసి తినడం.
9 - పెద్దలు తినడం ప్రారంభించక ముందే మీరు తినడం మొదలు పెట్టకూడదు.
10 - ఏదైనా పానీయం, మంచినీళ్ళు త్రాగే ముందు అల్లాహ్ పేరుతో ప్రారంభించడం, కూర్చుని మూడు గుక్కల్లో త్రాగడం.
11 - భుజించిన తర్వాత అల్లాహ్ ను స్తుతించడం.

జవాబు: 1- అల్లాహ్ ను స్తుతిస్తూ, కుడివైపు నుండి వస్త్రధారణ ప్రారంభించడం
2 - వస్త్రం, చీలమండలం క్రింద వరకు వేలాడేంత పొడువుగా ఉండకూడదు.
3 - అబ్బాయిలు అమ్మాయిల దుస్తులు ధరించకూడదు. అలాగే అమ్మాయిలు అబ్బాయిల దుస్తులు ధరించకూడదు.
4 - అవిశ్వాసుల మరియు దుర్మార్గుల వస్త్రధారణను అనుకరించ కూడదు.
5 - బట్టలు విప్పేటప్పుడు ముందుగా అల్లాహ్ పేరును ప్రస్తావించాలి.
6 - పాదరక్షలు ధరించేటప్పుడు ముందుగా కుడి వైపు నుండి మరియు వాటిని తీసేటప్పుడు ముందుగా ఎడమ నుండి ప్రారంభించండి.

జవాబు: 1 - తన ప్రయాణాన్ని "బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో, అల్'హందు లిల్లాహ్ (సకల ప్రశంసలు, కృతజ్ఞతలు అల్లాహ్ కే శోభిస్తాయి)" అనే పదాలతో ప్రారంభించాలి పరమ పరిశుద్ధుడగు అల్లాహ్ ఈ వాహనాన్ని మాకు లోబరిచాడు,మేము దీనిని మేము (ఆయన అనుగ్రహం లేకపోతే) దీనిని లోబరుచుకోలేక పోయేవారము, 13 మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది! 14 [సూరతుల్ జుఖ్'రుఫ్:13-14]
2 - ఒకవేళ ఎవరైనా ముస్లింను దాటుతున్న సందర్భంలో, అతనికి సలాం పలుకుతూ ముందుకు సాగండి

జవాబు: 1 - సాధారణ వేగంతో, వినమ్రత, అణుకువలతో రహదారికి కుడు వైపు నడవడం (ప్రభుత్వం నిర్దేశం ప్రకారం).
2 - దారిలో ఎదురయ్యే వారికి (పరిచయం ఉన్నా, లేకపోయినా) సలాం చేస్తూ, శుభాకాంక్షలతో పలకరించడం.
3 - చూపులు క్రిందకు దించి, ఎవరికీ హాని కలుగ జేయకుండా ప్రయాణించడం.
4 - మంచి వైపుకు ఆహ్వానించడం, చెడును ఖండించడం.
5 - దారి నుండి హానికరమైన వాటిని తొలగించడం.

జవాబు: 1 - ఎడమ కాలు బయట పెట్టి, ఇంటి నుండి బయటకు అడుగు వేస్తూ ఇలా దుఆ చేయ వలెను: "బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహుమ్మా ఇన్నీ అ'ఉదు బిక అన్ అదిల్ల అవ్ ఉదల్ల; అవ్ అజిల్ల, అవ్ ఉజల్ల, అవ్ అజ్'లిమ అవ్ ఉజ్'లమ; అవ్ అజ్'హల అవ్ ఉజ'హల అలయ్య" (అల్లాహ్ పేరుతో, నేను అల్లాహ్ పైనే ఆధారపడతాను మరియు అల్లాహ్లో తప్ప మరో దానిలో ఏ శక్తీ లేదా బలమూ లేదు. ఓ అల్లాహ్! నేను తప్పుదారి పట్టడం నుండి లేదా నన్ను ఎవరైనా తప్పుదారి పట్టించడం నుండి, నేను ఎవరినైనా అవమానించడం నుండి లేదా నన్ను ఎవరైనా అవమానించడం నుండి నేను ఎవరిపైనైనా దౌర్జన్యం చేయడం నుండి లేదా నాపై ఎవరైనా దౌర్జన్యం చేయడం నుండి, నేను అజ్ఞానంతో వ్యవహరించడం నుండి మరియు నాపై ఎవరైనా అజ్ఞానంతో వ్యవహరించడం నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.) 2 - కుడి పాదంతో ఇంట్లోకి ప్రవేశిస్తూ, ఇలా దుఆ చేయాలి: "బిస్మిల్లాహి వలజ్నా, వ బిస్మిల్లాహి ఖరజ్'నా, వ ‘అలా రబ్బినా తవక్కల్నా” (అల్లాహ్ పేరుతో మేము ప్రవేశిస్తాము, అల్లాహ్ పేరుతో మేము బయటికి వెళతాము మరియు మా ప్రభువుపైనే మేము ఆధారపడతాము).
3 - మిస్వాక్ ఉపయోగిస్తూ (దంతాలు శుభ్రపరిచే పంటిపుల్లతో దంతాలు శుభ్రం చేసుకుంటూ ), ఇంట్లోని వ్యక్తులను సలాం చేస్తూ ఇంటిలోనికి ప్రవేశించవలెను.

జవాబు: 1 - ఎడమకాలు లోపలికి పెట్టి ప్రవేశించడం.
2 - టాయిలెట్ లేదా హమామ్ లో ప్రవేశించే ముందు ఇలా దుఆ చేయడం: "అల్లాహ్ పేరుతో" ఓ అల్లాహ్! నేను అపరిశుద్ధమైన స్త్రీ పురుష జిన్నుల నుండీ నీ శరణు వేడుకుంటున్నాను.
3 - అల్లాహ్ యొక్క ధ్యానం (జిక్ర్) చేస్తూ టాయిలెట్లలో అస్సలు ప్రవేశించకూడదు.
4 - మలమూత్ర విసర్జన సమయంలో ఇతరులకు కనబడకుండా ఉండేందుకు ప్రైవసీతో ఉండే టాయిలెట్ గది లాంటిది లేదా పరదా లాంటిది ఏర్పాటు చేసుకోవడం.
5 - టాయిలెట్లో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడకుండా ఉండటం.
6 - మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఖిబ్లా దిశలో కూర్చోకుండా ఉండటం లేదా దాని వైపు వీపు చూపకుండా ఉండడం.
7 - మలినాలను తొలగించడంలో, మర్మాంగాలు కడగడంలో కుడి చేతిని కాకుండా ఎడమ చేతిని ఉపయోగించడం.
8 - ప్రజల మార్గంలో లేదా నీడలో మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటం.
9 - ఉపశమనం పొందిన తర్వాత చేతులు కడుక్కోవడం.
10 - కుడి పాదంతో టాయిలెట్ నుండి బయటకు వస్తూ ఇలా పలకాలి : "గుఫ్రానక్" (ఓ ప్రభూ, నన్ను క్షమించు)

జవాబు: 1 - కుడిపాదం లోపలికి పెట్టి మస్జిదులో ప్రవేశి స్తూ ఇలా దుఆ చేయవలెను. బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఫ్'తహ్ లీ అబ్'వాబ రహ్'మతిక (అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నా కొరకు నీ కారుణ్య ద్వారాలు తెరువుము)
2 - రెండు రకాతుల తహియ్యతుల్ మస్జిద్ సలాహ్ (నమాజు) పూర్తి చేయకుండా, మస్జిదులో కూర్చోవద్దు.
3 - సలాహ్ (నమాజు) చేసే వ్యక్తుల ముందు నుండి వెళ్ళకూడదు, పోగొట్టుకున్న వస్తువులను వెతకకూడదు లేదా మస్జిదులలో అమ్మడం మరియు కొనడం చేయకూడదు.
4 - ఎడమపాదం బయట పెట్టి, మస్జిదు నుండి బయటికి వస్తూ, ఇలా దుఆ చేయాలి. అల్లాహుమ్మ ఇన్నీ అస్'అలుక మిన్ ఫజ్'లిక. (ఓ అల్లాహ్, నీ దయతో నేను నిన్ను వేడుకుంటున్నాను')

జవాబు: 1 - ఒక ముస్లిమ్ ను కలిసినప్పుడు, "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు" (అల్లాహ్ యొక్క శాంతి, దయ మరియు ఆశీర్వాదాలు మీపై ఉండుగాక) అని ప్రశాంతంగా పలకరించడంతో సంభాషణ ప్రారంభించాలి. సలాం చెప్పకుండా, కేవలం చేతితో సంజ్ఞ చేయడం మాత్రమే సరిపోదు.
2 - చిరునవ్వు ముఖంతో ఇతరులకు సలాం చేయండి.
3 - కుడిచేత్తో కరచాలనం చేయండి
4 - ఎవరైనా సలాం చేసినప్పుడు, దానికి సమానమైన పదాలతో లేదా దాని కంటే ఉత్తమంగా ఇంకా ఎక్కువ పదాలతో తిరిగి సలాం చేయండి.
5 - అవిశ్వాసిని కలుసుకున్నప్పుడు, అతనికి సలాం చెప్పడంతో ప్రారంభించకూడదు. అతను అభివాదం చేస్తే, అలాంటి పదాలతోనే అతనికి బదులు పలకాలి.
6 - యువకులు వృద్ధులకు సలాం చేయాలి, వాహనం మీద వెళుతున్నవాళ్ళు, నడుస్తున్న వారికి సలాం చేయాలి, నడుస్తున్న వారు, కూర్చున్నవారికి సలాం చేయాలి, కొద్దిమందితో ఉన్న బృందం, ఎక్కువ మంది ఉన్న పెద్ద బృందానికి సలాం చేయాలి.

జవాబు: 1 - ఒక ప్రదేశంలోకి ప్రవేశించే ముందు అనుమతి కోరడం
2 - ప్రవేశించేందుకు మూడు సార్లు మాత్రమే అనుమతి కోరాలి, అంతకంటే ఎక్కువ సార్లు తగదు. అయినా అనుమతి లభించకపోతే, అక్కడి నుండి వాపసు వెళ్ళిపోవాలి.
3 - తలుపును సున్నితంగా తట్ట వలెను మరియు తలుపు నుండి దూరంగా నిలబడ వలెను అంటే, దాని కుడివైపున గానీ లేదా ఎడమవైపున గానీ.
4 - ముందుగా అనుమతి తీసుకోకుండా, ముఖ్యంగా తెల్లవారుజామున, మధ్యాహ్న సమయంలో మరియు ‘ఇషా’ సలాహ్ తర్వాత తల్లిదండ్రుల గదిలోకి లేదా ఇతరుల గదిలోకి అస్సలు ప్రవేశించవద్దు.
5 - అనుమతి తీసుకోకుండానే ఆసుపత్రి లేదా దుకాణం వంటి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంది.

జవాబు: 1 - జంతువులకు ఆహారం మరియు నీరు అందించడం.
2 - జంతువుపై దయ చూపడం మరియు అది భరించలేనంత భారం దానిపై వేయకుండా ఉండటం.
3 - ఏ విధంగానైనా జంతువును హింసించడం లేదా బాధించడం వంటివి వాటికి పాల్బడకుండా ఉండటం.

జవాబు: 1 - అల్లాహ్ కు విధేయత చూపడానికి మరియు ఆయన మెప్పును పొందటానికి అవసరమైనంత బలం చేకూర్చుకోవాలనే ఉద్దేశంతో క్రీడల అభ్యాసం చేయడం.
2 - సలాహ్ (నమాజు) సమయంలో క్రీడలు ఆపి వేయడం.
3 - అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి క్రీడలు ఆడకూడదు.
4 - మర్మవయవాలను (తప్పనిసరిగా కప్పబడి ఉండవలసిన శరీర భాగాలు) కప్పి ఉంచేలా క్రీడా దుస్తులను ధరించడం.
5 - ముఖం పై కొట్టడం లేదా 'మర్మావయవాలను బహిర్గతం చేయడం వంటి నిషేధించబడిన క్రీడలను నివారించడం.

జవాబు: 1 - హాస్యమాడుతున్నప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండాలి.
2 - హాస్యం అనేది ఎగతాళి, అపహాస్యం, హాని మరియు బెదిరింపులు లేకుండా ఉండాలి.
3 - తరచుగా జోకులు వేయడం మానుకోండి.

జవాబు: 1 - తుమ్మేటప్పుడు నోటిపై చేయి, వస్త్రం లేదా రుమాలు పెట్టుకోవడం
2 - తుమ్మిన తర్వాత అల్లాహ్ ను స్తుతిస్తూ: "అల్'హమ్'దు లిల్లాహ్" అని పలకడం.
3 - తుమ్మినవాని సోదరుడు లేదా సహచరుడు అతనితో ఇలా చెప్పాలి: "యర్'హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక).
దానికి బదులుగా తుమ్మినవారు ఇలా పలకాలి:
"యహ్'దీకుముల్లాహు వ యుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గనిర్దేశం చేసి మీ పరిస్థితిని మెరుగుపరుచు గాక)

జవాబు: 1 - ఆవలింతలను ఆపివేసేందుకు ప్రయత్నించాలి
2 - ఆవలిస్తున్నప్పుడు గొంతు పెంచి "ఆహ్", "ఉహ్" అంటూ శబ్దాలు చేయకూడదు
3 - నోటిపై చేయి పెట్టాలి

జవాబు: 1 - ఉదూ చేసిన తర్వాత తహారతు (కర్మ స్వచ్ఛత) స్థితిలో ఉన్నప్పుడు పఠించడం.
2 - వినమ్రతతో, అణుకువతో మర్యాదగా మరియు హుందాగా కూర్చుని ఖుర్ఆన్ పారాయణం చేయడం.
3 - అల్లాహ్ వద్ద షైతాను బారి నుండి కాపాడమని శరణు వేడుకుంటూ పారాయణం ప్రారంభించడం.
4 - దీర్ఘాలోచన చేస్తూ పారాయణం చేయడం.